కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై పశ్చిమ బెంగాల్ సీఎం సీరియస్

by Harish |
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై పశ్చిమ బెంగాల్ సీఎం సీరియస్
X

కోల్‌కతా: 2025 తర్వాత నుంచి టీఎంసీ మనుగడలో ఉండదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రివి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలని విమర్శించారు. అమిత్ షా తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా అని అన్నారు. బీజేపీ 35 లోక్‌సభ సీట్లు గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన పాలనను పూర్తి చేసుకోదని అనకుండా ఉండాల్సిందని అన్నారు.

ప్రస్తుతం వరుసగా మూడోసారి మమతా ప్రభుత్వం అధికారంలో ఉంది. 2026 కల్లా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అంతకుముందు అమిత్ షా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బెంగాల్‌లో 35 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే 2025లో టీఎంసీ ప్రభుత్వాన్ని మనుగడలో లేకుండా చేస్తామని అన్నారు. ఇది కాస్త బెంగాల్ సీఎం ఆగ్రహానికి దారి తీసింది.

Advertisement

Next Story

Most Viewed