- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smriti Irani: రూ.2వేల కోట్లను కాపాడేందుకు కాంగ్రెస్ నిరసనలు : స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: Congress Protest 'To Save 2000 Crores of Gandhis': Smriti Irani| కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీ నేతల నిరసనలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను కాపాడేందుకే పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారని విమర్శించారు. సోమవారం ఈడీ కేసు విషయమై మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాదని ఆరోపించారు. ఈ నిరసనలు దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకేనని అన్నారు. దీంతోనే వారు బహిరంగంగా అవినీతి పాల్పడారనే విషయం రుజువైతున్నదని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, రాహుల్ గాంధీ అందుకు మినహాయింపేమి కాదని చెప్పారు. వాస్తవానికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ 5వేల మంది స్వాతంత్య్ర ఉద్యమకారులు వాటాదారులుగా ప్రారంభమైందని అన్నారు. కానీ ఇప్పుడు గాంధీ కుటుంబం అధీనంలోకి రూపాంతరం చెందిందని ఆరోపించారు. అంతేకాకుండా ఓ సంస్థ సామాజిక సేవ కోసం ఏర్పాటు చేసి, గాంధీ కుటుంబం కోసం పనిచేస్తుందని ఇరానీ విమర్శించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలకు డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తమ నేతకు సంబంధం ఏమిటని అడగాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
- Tags
- Smriti Irani