ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రివిలైజ్ మోషన్ పిటిషన్

by Satheesh |   ( Updated:2024-07-31 09:21:51.0  )
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రివిలైజ్ మోషన్ పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రివిలైజ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. లోక్ సభలో మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘తన కులమే తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారు’ అని పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్‌ను ప్రధాని మోడీ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభలో ఈ కామెంట్స్ చేసిన అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో పాటు ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ షేర్ చేసిన ప్రధాని మోడీపై ప్రివిలైజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద అనురాగ్ ఠాకూర్, ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్‌ను కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed