- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమతా బెనర్జీపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, షీట్ల షేరింగ్ విషయంలో ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో..పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. ప్రధాని మోడీకి సేవచేయడంలో మమత బిజీగా ఉన్నారని కామెంట్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బెంగాల్‌లో టీఎంసీతో తాము పొత్తుపెట్టుకోవడం లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని వెల్లడించారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదన్నారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామి అయిన టీఎంసీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.