జాతీయ గీతాన్ని అవమానించిన జాతినేలే నేతలు.. పోయిందిగా ఆ పార్టీ పరువు

by Indraja |
జాతీయ గీతాన్ని అవమానించిన జాతినేలే నేతలు.. పోయిందిగా ఆ పార్టీ పరువు
X

దిశ డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమరాగ్ని యాత్రను నిర్వహించింది. ఈ సమావేశంలో గౌరవప్రదమైన జాతీయ గీతానికి అవమానం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమరాగ్ని యాత్రను జాతీయ గీతంతో ముగించాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం డీసీసీ అధ్యక్షుడు పాలోడే రవి జాతీయ గీతాన్ని ఆలపించేందుకు మైక్ తీసుకున్నారు.

అనంతరం అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరారు. ఆ తరువాత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ.. మొదటి లైన్ లోనే తప్పుగా పాడారు. అయితే వెంటనే పొరపాటున గుర్తించిన ఎమ్మెల్యే టి.సిద్ధిక్‌.. మైక్‌ లాక్కొని సీడీ అక్కడ పెడతాను అంటూ మైక్‌ నుంచి రవిని పంచించేశారు. ఆ తరువాత ఒక మహిళా నాయకురాలు వచ్చి జాతీయ గీతాన్ని అలపించి సమావేశాన్ని ముగించారు.

కాగా పాలోడే రవి జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో వేదికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా చేతకాని వ్యక్తులు పాలించే నేతలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


Advertisement

Next Story