- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో రెండేళ్ల జైలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ప్రధాని మోడీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ గురువారం సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ఆర్థిక నేరగాళ్లు అందరూ చివర్లో మోడీ పేరుతోనే ఎందుకు ఉంటారంటూ 2019లో కర్నాటకలో ఎన్నికల ప్రచార సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మోడీ అని ఇంటి పేరు ఉన్న అందరి మనోభావాలను దెబ్బ తీసాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, గురువారం ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం దోషిగా తేల్చింది. ఈ తీర్పుపై పై కోర్టుకు వెళ్లటానికి రాహుల్ గాంధీకి కోర్టు గడువు ఇచ్చింది.
రాహుల్ గాంధీకి బెయిల్
క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన రాహుల్ గాంధీకి గుజరాత్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సూరత్ కోర్టు శిక్ష ప్రకటించగానే రాహుల్ గాంధీ తరపు అడ్వకేట్లు హై కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 10 వేల రూపాయల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది.
Read more: