- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : కాంగ్రెస్‌ను తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారు : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానించేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటైపోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. నేటి కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి భావం అనేది పూర్తిగా చచ్చిపోయిందన్నారు. ద్వేషపు పిశాచి ఇప్పటి కాంగ్రెస్‌లో వేళ్లూనుకుందని విమర్శించారు. శుక్రవారం మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘విదేశాలకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో చూడండి.. వాళ్ల భాష ఎలా ఉందో చూడండి.. వాళ్లది దేశ వ్యతిరేక ఎజెండా. సమాజాన్ని విభజించడం గురించి వాళ్లు మాట్లాడుతున్నారు.. దేశ కల్చర్‌ను అవమానిస్తున్నారు’’ అని ప్రధాని మండిపడ్డారు.
‘‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్‌కు చెందిన వాళ్లు కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారు. గణేశ్ పూజ నిర్వహించడాన్ని కూడా వాళ్లు ఓర్వలేకపోతున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా గణపయ్య ప్రతిమను పోలీసు వ్యానులో పెట్టించింది’’ అని మోడీ కామెంట్ చేశారు. ‘‘కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయినా నేటికీ రైతులు రుణమాఫీని పొందలేదు. మన దేశంలో అత్యంత అవినీతిమయ కుటుంబం ఏదైనా ఉందంటే అది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ కాంగ్రెసే’’ అని ప్రధాని విమర్శలు గుప్పించారు.