- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్ కంటే బెంగాల్‌లోనే దారుణమైన పరిస్థితులు : టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మణిపూర్ కంటే బెంగాల్‌లోనే అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉన్న బెంగాల్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం మంచిది కాదన్నారు. టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం బీర్‌భూమ్‌లో చాలా అవినీతి, హింస జరుగుతుందన్నారు. బొగ్గు, విద్యాశాఖ, రేషన్‌కు సంబంధించిన అవినీతి కేసులు ఎక్కువగా బీర్‌భూమ్ జిల్లాలోనే జరిగాయని గుర్తు చేశారు. దేశ సరిహద్దుల్లో భద్రత సరిగా లేక పోవడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. కాగా, ఈ నెల 5న పశ్చిమ బెంగాలోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఈడీ అధికారులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.