- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా చరిత్ర బూడిదలో ముగుస్తుంది.. నిక్కీ హెలీ సంచలన కామెంట్స్
ఛార్లెస్టన్: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన భారత సంతతి రిపబ్లికన్ నేత నిక్కీ హెలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోవిట్ యూనియన్ వలె కమ్యూనిస్టు చైనా చరిత్ర బూడిదలో ముగుస్తుందని అన్నారు. బుధవారం ఆమె దక్షిణ కరోలినా లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. 'అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలు గతంలో కంటే బలంగా, మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
బలమైన సైన్యం యుద్ధాలను ప్రారంభించదు. బలమైన సైన్యం యుద్ధాలను నిరోధిస్తుంది' అని అన్నారు. మిత్రపక్షాలు ఇజ్రాయిల్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటూనే శత్రువులు ఇరాన్, రష్యాలకు వ్యతిరేకంగా ఉండాలని కోరారు. ఇప్పటికే యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని హేలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌నకు వ్యతిరేకంగా బరిలోకి దిగనున్న పోటీదారుగా నిలిచారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు 80 కి సమీపించడంతో తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసేదానిపై స్పష్టత లేదు. అంతకుముందు అమెరికా గగనతలంలో చైనా అనుమానిత స్పై బెలూన్ పేల్చివేత ఘటన నేపథ్యంలో హేలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.