- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2024: బడ్జెట్‌పై రాహుల్, చిదంబరం, అఖిలేష్, కంగనా.. కామెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభ పక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌గా(కుర్చీ బచావో బడ్జెట్) అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు వారికి ఎక్కువ ప్రయోజనాలను కల్పించారని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో, మునుపటి బడ్జెట్‌ల నుండి కాపీ-పేస్ట్ అని రాహుల్ విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బడ్జెట్‌పై ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల ఫలితాల తర్వాత గౌరవనీయులైన ఆర్థిక మంత్రి కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివారని, ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తారన్న వార్త వినడం తనకు కూడా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కాంగ్రెస్ చాలా ఏళ్లుగా దీనిని రద్దు చేయాలని అభ్యర్థిస్తోంది, ఇటీవల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 31వ పేజీలో కూడా ఇది ఉందని చిదంబరం చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను కాపీ చేశారని ఆయన అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్ర బడ్జెట్‌పై మండిపడ్డారు. యువత, రైతుల ప్రయోజనాలను విస్మరించారని, తమ ప్రభుత్వాన్ని "రక్షించుకోవాలనే" రాజకీయ బలవంతంతో మిత్రులకు అనేక వరాలను అందించారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదని అఖిలేష్ అన్నారు. అలాగే, యువత శాశ్వత ఉద్యోగాలను కోరుకుంటున్నారని, ఇంటర్న్‌షిప్ వంటి స్వల్పకాలిక చర్యలు కాదని ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బడ్జెట్‌పై మండిపడ్డారు. ఇది అణచివేత బడ్జెట్‌గా అభివర్ణించారు. సామాన్యులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి, ఆదాయ అసమానతలను పరిష్కరించడంలోను ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్నును రద్దు చేసే ఒక నిబంధనను మాత్రమే నేను స్వాగతిస్తున్నానని శశి థరూర్ అన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. అధికార సంకీర్ణంలోని కీలక మిత్రపక్షాలను కాపాడుకోడానికి, వారి కోసం మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, ఇది కుర్చీ కాపాడుకునే బడ్జెట్ అని కేంద్రంపై విమర్శలు చేశారు.
మరోవైపు లోక్‌సభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర బడ్జెట్ 2024ని 'భవిష్యత్ బడ్జెట్' గా అభివర్ణించారు, ఇది భారతదేశం స్వావలంబన లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుందని అన్నారు. సినిమాల నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ బడ్జెట్‌పై మాట్లాడుతూ, బడ్జెట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు రిలీఫ్ ఫండ్‌ను కేటాయించారు, కేంద్ర బడ్జెట్ పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, భారతదేశ వృద్ధిని కొనసాగించేందకు కేంద్ర బడ్జెట్‌ను పటిష్టమైన రోడ్‌మ్యాప్‌గా రూపొందించామని పేర్కొన్నారు.