పాకిస్థాన్ కు చెందిన వ్యక్తికి.. సీఎం చేతుల మీదుగా భారత పౌరసత్వం

by Mahesh |
పాకిస్థాన్ కు చెందిన వ్యక్తికి.. సీఎం చేతుల మీదుగా భారత పౌరసత్వం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ (సవరణ) 2019 చట్టం ఆయా రాష్ట్రాలు పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పౌరసత్వ (సవరణ) చట్టం కింద పెరీరాకు భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. గోవా సంతతికి చెందిన జోసెఫ్ పెరీరా, గోవా విముక్తికి ముందు పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చారు. అతను సెప్టెంబర్ 11, 2013 నుండి భారతదేశంలో నివసిస్తున్నాడు. దీంతో అతను భారత పౌరసత్వానికి అర్హుడనని.. పౌరసత్వ (సవరణ) 2019 చట్టం ప్రకారం తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో సీఎం స్వయంగా జోసెఫ్ పెరీరాకు పౌరసత్వ సర్టిఫికేట్ ను అందించారు.

Advertisement

Next Story