‘గవర్నర్‌గా ముందు మీ బాధ్యత ఏంటో తెలుసుకోండి’.. సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
‘గవర్నర్‌గా ముందు మీ బాధ్యత ఏంటో తెలుసుకోండి’.. సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor Ravi), ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నైలోని దూరదర్శన్‌ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ద్రవిడ అనే పదం పలకకపోవడంపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన అలా ప్రవర్తించారని.. వెంటనే ఆయన్ను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్‌భవన్‌ను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని అన్నారు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘మా ద్రవిడ మోడల్ పరిపాలన మీకు నచ్చదు. గతంలోనే తమిళనాడు అనే పదం మార్చాలని మాట్లాడారు.

తమిళ భాష కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి తాము సిద్ధం. మాపై నిర్బంధ హిందీ భాషను తీసుకొస్తే ఊరుకోం. గవర్నర్‌గా ముందు మీ బాధ్యతను ఏంటో గుర్తించాలి’ అని గవర్నర్‌కు స్టాలిన్ హితవు పలికారు. ఈ వివాదంపై గవర్నర్‌ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తప్పేమీ లేదని పేర్కొంది. ఆయన హాజరైన కార్యక్రమంలో తమిళ గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా పేర్కొంది. ఈ విషయం వెంటనే నిర్వాహకుల దృష్టికి తేవడంతో పాటు, సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు గవర్నర్‌ కార్యాలయం పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed