తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్

by Gantepaka Srikanth |
తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు అలా అందరూ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అక్టోబర్ 14వ తేదీన న్యూడ్ వీడియో కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన ఎమ్మెల్యేకు న్యూడ్‌గా కనిపించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చినటువంటి లింక్స్, యుఆర్ఎల్స్ నొక్కకూడదు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని, యువతులతో వీడియో కాల్స్ చేయిస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాదు.. మనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పినా ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని అలర్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed