- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: రేవంత్‌ను దించేందుకు మంత్రులే కుట్రలు చేస్తుండ్రు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు ప్రభుత్వంలోని మంత్రులే కుట్రలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఓ వైపు మూసీ సుందరీకరణ అంశం ప్రభుత్వంలో అనిశ్చితిని నెలకొల్పిందని ఆరోపించారు. మరోవైపు ‘హైడ్రా’ కూల్చివేతలు, గ్రూప్-1 ఉద్యోగులు ఆందోళలను సీఎం రేవంత్‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయని పేర్కొన్నారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని అన్నారు. ఎప్పుడెప్పుడు రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించేద్దామా అని సొంత పార్టీలోనే కుట్రలు చేస్తున్నారని.. అందుకు సరైన సమయం కోసం వాళ్లు వేచి చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మహిళా అభ్యర్థులను సైతం అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో పట్టింపులకు పోకుండా.. రీ షెడ్యూల్ చేయాలని బండి సంజయ్ సూచించారు.
Read More:
కేటీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఈ అహంకారమే కొంపముంచిందని ఫైర్