కర్నూలు జిల్లా కాల్వబుగ్గ రామేశ్వర దేవాలయం వద్ద అద్భుత దృశ్యం

by Prasanna |   ( Updated:2024-10-19 08:46:46.0  )
కర్నూలు జిల్లా కాల్వబుగ్గ రామేశ్వర దేవాలయం వద్ద  అద్భుత దృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వాటిలో కొన్ని మాత్రమే చూడగలుగుతాము, మరి కొన్ని అసలు కనిపించవు. ఇలా కనిపించని వాటి వెనుక సైన్స్ ఉంటుందని నమ్ముతుంటారు. మరి కొందరు దైవం అని అంటుంటారు. తాజాగా, కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోనేరులో నీరు ఎలా ఉంటాయో మనకీ తెలిసిందే. కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ రామేశ్వర దేవాలయం వద్ద ఉన్న కోనేరు దగ్గర అద్భుత దృశ్యం చూసి అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఏ వరద నీరు అయిన కోనేరులో కలుస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం కలవకపోవడం విశేషం. చాలా మంది ఇది సైన్స్ అంటుంటే, కొందఱు మాత్రం ఇది ఖచ్చితంగా దేవుడి మహిమే కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదట.. నాలుగేళ్ల క్రితం జరిగిన వీడియో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed