తప్పులు జరిగితే సరిదిద్దుకోడానికి సిద్ధం.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-10-19 08:05:56.0  )
తప్పులు జరిగితే సరిదిద్దుకోడానికి సిద్ధం.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఇవాళ రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. అదేవిధంగా చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు బీ. మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగ ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నాడు అల్లకల్లోలంగా ఉన్న దేశంలో సద్భావన తీసుకురావాలని, కులాలు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని రాజీవ్ గాంధీ నాడు యవత్ దేశంలో చార్మినార్‌లో యాత్ర చేశారని తెలిపారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని అన్నారు. దేశం సమైక్యంగా ఉండాలని ఇందిరాగాంధీ ప్రాణాలు వదిలారని చెప్పుకొచ్చారు. ఈనాడు దేశాన్ని పాలిస్తున్న నాయకులు ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో పాత్ర ఉందా?అని ప్రశ్నించారు.

స్వాతంత్రం వద్దన్న వ్యక్తులు నాటి వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ అని ఫైర్ అయ్యారు. నేడు దేశాన్ని పాలిస్తూ మతం, కులం పేరిట విచ్చిన్నం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇష్ట్రారాజ్యంగా ఎడిటింగ్‌లు మార్ఫింగ్‌లు చేస్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒక సీఎంగా మూసీ నదికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత కూడా వారు లక్షలు, కోట్లు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడినుంచి వచ్చింది ఆ ఫిగర్ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. మీరు దొచ్చుకున్న తీరులో అందరికి ఆపాదిస్తే ఎలా? అని నిలదీశారు. కేటీఆర్ చదువుకున్న వ్యక్తిగా వాస్తవాలు మాట్లాడు.. రేవంత్ రెడ్డి, మేముగాని చిన్న చిన్న తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పులు జరిగితే ప్రతిపక్షంలో ఉండి సూచిస్తే తీసుకుంటాము.. కానీ అబద్దపు ప్రచారం చేయడం, ఉన్నది లేనట్లు చేప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న కార్యక్రమాలు 90 శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story