- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వైసీపీ కీలక నేతకు ఈడీ బిగ్ షాక్..!
దిశ,వెబ్‌డెస్క్: మాజీ వైసీపీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసుకు సంబంధించి విశాఖలోని ఆయన ఆస్తులపై నేడు(శనివారం) సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడ భూమి కొనుగోలు కేసులో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. రూ.12.5 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ ఇటీవల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం ఐదు చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. విశాఖ పరిధిలో నమోదు చేసిన కేసులు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
విశాఖ లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణ తో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ ఓనర్ రాధారాణి, కంపెనీ ఎండీ జగదీశ్వరుడు ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎంవీవీ ఆడిటర్ వెంకటేశ్వరరావుతోపాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. అధికారులు ఎంవీవీ ఇంటికి తాళాలు వేసి మరీ తనిఖీ చేపట్టారు. కానీ మాజీ ఎంపీ ప్రస్తుతం ఇంట్లో లేరని అధికారులు చెబుతున్నారు.