గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

by Sumithra |   ( Updated:2024-10-19 06:42:13.0  )
గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
X

దిశ, నల్లగొండ : మిర్యాలగూడలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల అనంతరం ఓ విద్యార్థిని ఆమె తండ్రి శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో వదిలి వెళ్ళాడు. అదేరోజు సాయంత్రం ఆ విద్యార్థిని తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నానని పాఠశాల సిబ్బందికి తెలిపిందన్నారు. దీంతో సిబ్బంది విద్యార్థిని వెంటనే మిర్యాలగూడలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి సమయంలో తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సరిత దిశతో మాట్లాడుతూ విద్యార్థిని కళ్ళు తిరుగుతున్నాయని, కడుపునొప్పితో బాధపడుతున్న అని తెలిపిందన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడ స్టాఫ్ నర్స్ ని పిలిచి చూపించారన్నారు. అప్పటికే విద్యార్థిని తన నాన్నమ్మ ఇంటి వద్ద పురుగుల మందు తాగి పాఠశాలకు వచ్చినట్లు వారు తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దే తాము ఉన్నట్లు వారు తెలిపారు.

విద్యార్థిని తల్లితండ్రులు..

తమ కూతురుని పాఠశాలకి పంపి వచ్చే వరకు తమకు తమ పాప వద్ద ఎలాంటి పురుగుల మందు వాసన రాలేదన్నారు. తాము ఇంటికి వచ్చాక మీ పాప ఆరోగ్యం బాగాలేదని సిబ్బంది తెలుపగా అక్కడికి వెళ్లి తమ పాపని అడిగామని, మొదటగా నాన్నమ్మ ఇంట్లో మందు తాగాను అని తరువాత మళ్ళీ పాఠశాలలోనే పురుగుల మందు తాగాను అని తన తల్లికి చెప్పినట్లు విద్యార్థిని తల్లి దిశతో తెలిపారు.

విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ఖమ్మం పాటి శంకర్..ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి

గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 9వ తరగతికి చదువుతున్న విద్యార్ధినికి మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. అలాగే ఉమ్మడి నల్లగొండలో తరచు ఇలాంటి సంఘటనలు జరగడం పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed