Lokesh Kanagaraj: ఆ సినిమా నా హృదయానికి దగ్గరగా ఉంటుంది.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
Lokesh Kanagaraj: ఆ సినిమా నా హృదయానికి దగ్గరగా ఉంటుంది.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలతో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేపిస్తూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే గత ఏడాది లోకేష్ (Lokesh Kanagaraj)తెరకెక్కించిన మూవీ ‘లియో’(Leo). ఇందులో విజయ్ దళపతి(Vijay Thalapathy), త్రిష జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా (అక్టోబర్ 19న 2023) విడుదలై బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద రూ. 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తాజాగా, ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి కావడంతో లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘లియో‌(Leo)తో చాలా అభ్యాసాలు, చాలా జ్ఞాపకాలు, చాలా ఉత్తేజకరమైన క్షణాలు పొందాను.

ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా లియో(Leo). ఈ మూవీ తెరకెక్కే లాగా చేసినందుకు ఎప్పటికీ నిన్ను చాలా ప్రేమిస్తుంటాను దళపతి విజయ్(Vijay Thalapathy). ఈ సినిమా కోసం మా కష్టాన్ని గుర్తించి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా విజయ్‌తో కలిసి తీసుకున్న పిక్ షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. లియో సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంపై ఇటీవల లోకేష్ కూడా క్లారిటీ ఇవ్వడంతో విజయ్ (Vijay Thalapathy)ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ 69(Vijay 69) మూవీతో సినిమాలకు దూరంగా కానున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మళ్లీ విజయ్‌ను స్క్రీన్‌పై చూడలేమని ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే లీయో సీక్వెల్ రాబోతున్నట్లు డైరెక్టర్ చెప్పడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తారని ఆశ పడుతున్నారు.

Advertisement

Next Story