- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లష్కర్ బంద్.. పది గంటలు దాటినా తెరుచుకోని దుకాణాలు..
దిశ, కంటోన్మెంట్ : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా నేడు సికింద్రాబాద్ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలోని వ్యాపార సముదాయాలు, దుకాణాలు, హోటల్స్ ఇంకా తెరుచుకోలేదు. ఉదయం నుండి వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక షామీర్ పేట, పూడూర్ లోని ఈటల రాజేందర్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ముత్యాలమ్మ దేవాలయ ధ్వంసానికి నిరసనగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ముత్యాలమ్మ దేవాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ర్యాలీలో పాల్గొంటానని ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.