- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Vs New Zealand: బెంగళూరులో సర్ఫరాజ్ వీరవిహారం... టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగుస్తోంది. నాలుగో రోజు ఉదయం రంజి స్పెషలిస్ట్, భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో అతడు ఇంటర్‌నేషనల్ కేరీర్‌లోనే తన శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. మెరుపుల్లాంటి బంతులను కూడా తనదైన స్ట్రోక్ ప్లేతో బిగ్ షాట్స్ ఆడుతూ.. కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. మరో ఎండ్‌లో రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. ప్రస్తుతం టీమిండియాలో 337 పరుగులు చేసి 3 కీలక వికెట్లను కోల్పోయింది. సర్ఫారాజ్ ఖాన్ 150 బంతుల్లో 124, రిషభ్ పంత్ 52 బంతుల్లో 47 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ 402 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో రచిన్ రవీంద్ర (134) సెంచరీతో ఆదుకున్నాడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ (65) రచిన్‌కు తోడయ్యాడు. టీమిండియాలో బౌలర్లలో జడేజా, కుల్దీప్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. 356 పరుగుల లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను అరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.
అదరగొట్టిన విరాట్, రోహిత్
మొదటి ఇన్సింగ్స్ భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఆచితూచి ఇన్సింగ్స్‌ను ఆరంభించారు. ఓ వైపు యశస్వీ జైస్వాల్ (35) కాస్త ఇబ్బంది పడగా.. కెప్టెన్ రోహిత్ (52) మాత్రం ఫోర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక కింగ్ కోహ్లీ (70) తనదైన షాట్లతో స్కోర్ బోర్టును పరుగులు పెట్టించాడు. అనంతరం క్రీజ్‌లో వచ్చిన సర్ఫరాజ్ ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేయడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.