Yahya Sinwar: హమాస్‌ అధినేత సిన్వర్‌ పోస్టుమార్టంలో కీలక విషయాలు..!

by Shamantha N |
Yahya Sinwar: హమాస్‌ అధినేత సిన్వర్‌ పోస్టుమార్టంలో కీలక విషయాలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ (Yahya Sinwar) మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. అతడి తలపై బుల్లెట్ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని తెలుస్తోంది. మరణానికి ముందు అతని ముంజేయికి గాయమై, తీవ్రమైన రక్తస్రావం జరిగిందని శవపరీక్ష పర్యవేక్షించిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పర్యవేక్షించిన ఇజ్రాయెల్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ చెన్ కుగెల్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. తలపై తుపాకీ గాయం వల్లే సిన్వార్ మరణించినట్లు తెలిపారు. ఇతర గాయాలు కూడా అయినట్లు వెల్లడించారు. 61 ఏళ్ల హమాస్ చీఫ్‌ను డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించామన్నారు. అతని వేలిని కత్తిరించి పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.

డీఎన్ఏ ద్వారా గుర్తింపు

సిన్వర్ తాడుతో బ్లీడింగ్ ని ఆపేందుకు ప్రయత్నించాడు కానీ, అది ఏ సందర్భంలోనూ పనిచేయలేదని డాక్టర్ చెన్ కుగెల్ తెలిపారు. సిన్వార్ మరణించిన 24 నుండి 36 గంటల తర్వాత శవపరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఇజ్రాయెల్ మిలిటరీకి అప్పగించామన్నారు. వారు దానిని తెలియని ప్రదేశానికి తరలించి ఉండొచ్చని పేర్కొన్నారు. సిన్వర్ ఖైదీగా ఉన్నప్పుడు తమ వద్ద ఉన్న ప్రొఫైల్‌తో డీఎన్ఏ ని పోల్చి గుర్తించినట్లు తెలిపారు. ఇకపోతే, అక్టోబరు 17న సిన్వర్ మరణాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనుక ఆయనే ఉన్నాడు.

Advertisement

Next Story