గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి : అమ్మాయిల ర్యాలీ

by Y. Venkata Narasimha Reddy |
గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి : అమ్మాయిల ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్ : మారుతున్న కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు కూడా మారిపోతున్నాయి. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా, మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయిలను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం `గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి`` అంటూ వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు ఇండోర్ వీధుల్లో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.``నో క్లీన్ షేవ్.. నో లవ్``, ``గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి``, ``గడ్డాన్ని అయినా వదులుకో లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను అయినా వదులుకో``, ``నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్`` అంటూ ఆ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 4.4 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. ``మా గడ్డం.. మా ఇష్టం``, ``మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి``, ``వారానికి ఒకసారైనా మీరు గడ్డం గీసుకోవాలి.. అప్పుడే మీకు, ఎలుగుబంట్లకు తేడా ఉంటుంది``, ``నేను అర్జంటుగా ఇండోర్ వెళ్లాలి`` అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండంటూ ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన మరి మునుముందు ఏ ట్రెండ్ సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed