Allu Arjun: బరువు మొత్తం బన్నీ పైనే.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్

by Prasanna |   ( Updated:2024-10-19 07:37:08.0  )
Allu Arjun: బరువు మొత్తం బన్నీ పైనే.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదిలో ఎన్ని హిట్ సినిమాలు వచ్చిన పుష్ప 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

2024 లో పాన్ ఇండియన్ సినిమాలు తక్కువగానే వచ్చాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్‌ మూవీ రూ. 350 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, ఈ ఏడాది " పుష్ప 2 " బరువు బాధ్యతలు తానే తీసుకుంటానంటూ ఐకాన్ స్టార్ ఒక అడుగు ముందుకేశారు.

డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్‌లోనూ ఈ మూవీ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 2021 డిసెంబర్‌ 17 న రిలీజ్ అయిన పుష్ప మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. మూడేళ్ళ గ్యాప్‌తో మళ్ళీ ఇదే నెలలో అదే కాన్ఫిడెన్స్ తో మన ముందుకు రానుంది. రూ .1000 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఈ ప్రాజెక్ట్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. సినిమా హిట్ అయి మంచి కలెక్షన్స్ రావాలంటే బన్నీ మీదే ఆధారపడి ఉంది.


👉 Also Read: "చచ్చిపోతాను అని చెప్పినా కూడా నా భార్య పట్టించుకోలేదు".. ఐకాన్ స్టార్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story