- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడేం కాదు’.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మూసీ కష్టాలంటే ఏంటో నల్లగొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయినా కూడా బీఆర్ఎస్(BRS) నేతల్లో ఇంకా అహంకారం మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. కేబుల్ బ్రిడ్జి తప్ప హైదరాబాద్‌కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్లగొండ ప్రజలేం అమాయకులు కాదని చెప్పారు. నల్లగొండ ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలు ఉంటాయని స్పష్టం చేశారు.
బీజేపీ నేతలకు కూడా మూసీ ప్రక్షాళనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధలు కిషన్ రెడ్డికి తెలియవా? అని ప్రశ్నించారు. అసలు కిషన్ రెడ్డి(Kishan Reddy) గురించి మాట్లాడుకోవడం వేస్ట్.. ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కూడా కాదని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన అనేది గొప్ప కార్యక్రమమని అన్నారు. బాధితులను రోడ్డున పడనివ్వబోమని.. డబుల్ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని భరోసారి ఇచ్చారు. విపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.