అది పులి కాదు.. అడవి పిల్లి..

by Sumithra |
అది పులి కాదు.. అడవి పిల్లి..
X

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ లో కలకలం సృష్టించింది చిరుత కాదని, అది అడవి పిల్లి అని తేల్చారు ఫారెస్ట్ అధికారులు. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుత పులి సంచరిస్తుంది అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొట్టడంతో స్థానికులు, నగరవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మియాపూర్ సీఐ క్రాంతి కుమార్, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లు మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల పరిస్థితులను పర్యవేక్షించారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అలాగే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

రాత్రి చాలా సేపటి వరకు పులి కోసం గాలించినా ఎక్కడా దాని జాడ కనిపించలేదు. ఉదయం మరోసారి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన ప్రదేశాల్లో తిరిగి పాదముద్రలు సేకరించారు. మియాపూర్ మెట్రో వెనకాల సంచరించింది పులి కాదని, అది అడవి పిల్లి అని తేల్చారు. ఒక్కో పాదముద్ర కేవలం 3.5 సెంటీ మీటర్ల నుండి 4 సెంటీ మీటర్లు మాత్రమే ఉందని, పులి పాద ముద్రలు 7 సెంటీ మీటర్ల నుండి 8 సెంటీమీటర్ల వరకు ఉంటాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావొద్దని అధికారులు భరోసా కల్పించారు.

Advertisement

Next Story

Most Viewed