- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం
by Sridhar Babu |
X
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. హుజురాబాద్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి సమీపంలోని బుడుగజంగాల కాలనీకి చెందిన ఒక బాలిక (16)ను పట్టణానికి చెందిన శేఖర్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శనివారం సాయంత్రం కిరాణా దుకాణం షాపునకు వెళ్లిన బాలికను అదే ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికినా సమాచారం లభించలేదు. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు బాలిక ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. కాగా కిడ్నాప్ చేసిన శేఖర్ వివాహితుడు కావడమే కాకుండా పిల్లలు సైతం ఉన్నట్లు సమాచారం.
Advertisement
- Tags
- Kidnapping
Next Story