పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..భారీగా మోహరించిన పోలీసులు

by Aamani |
పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..భారీగా మోహరించిన పోలీసులు
X

దిశ, పాలకుర్తి/తొర్రూరు: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న శ్రీనివాస్ అనే వ్యక్తి పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని,ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.దీంతో గిరిజన సంఘాల నేతలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీసులు భారీగా మోహరించారు. బాధితులు ఆందోళన చేపట్టడంతో పాటు పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఈ ఆత్మహత్య కారణమైన పాలకుర్తి ఎస్ఐ, సీఐ సస్పెండ్ చేయాలని,అదేవిధంగా ఎస్ఐ కి ఫోన్ చేసి కేసును పట్టించుకోవద్దని చెప్పిన పార్టీ నాయకులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ధర్నా చేశారు. పోలీసులకు, బంధువులకు తండావాసులుకు మధ్య చాలా సేపు తోపులాట జరిగింది. సంఘటన స్థలానికి జనగాం డీసీపీ చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు బంధువులకు సముదాయించే ప్రయత్నం చేశారు.కానీ బంధువులు వినకుండా శ్రీను చితిని రోడ్డుపైనే పేర్చాలని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై జరగడం వల్ల రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.

ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తాం : జనగామ డీసీపీ

పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో జనగాం డీసీపీ రాజమహేంద్ర నాయక్,మీడియా సమావేశంలో మాట్లాడుతూ....లూనావత్ శీను ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు పై కేసు నమోదు చేశమని,ఆరుగురిని ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా మృతుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ప్రభుత్వపరంగా రావలసినవన్ని అందించే విధంగా చూస్తామన్నారు.

పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్

లకావత్ శ్రీను తల్లిదండ్రులు జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ ప్రసన్న కుమార్ లపై చర్యలు తీసుకోవాలని, గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయం పై పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

శ్రీను మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మృతిచెందిన లకావత్ శ్రీను మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాట్లాడుతూ..లకావత్ శీను ఆత్మహత్యయత్నానికి పాల్పడం చాలా బాధాకరం అని,ఆత్మహత్యకు కారకులు ఎవరో, అనే విషయాలు తెలియాల్సి ఉందని, కారకులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్టబద్ధమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కి ఫోన్ చేసి జరిగిన సంఘటనపై ఆరా తీసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశించారు.


గిరిజన బిడ్డ శ్రీను మృతి చాలా బాధాకరం : మాజీ మంత్రి ఎర్రబెల్లి..

లకావత్ శ్రీను భౌతిక దేహానికి, పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు వెన్ను దండుగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed