- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ స్టేజ్‌పై ఏం మాట్లాడాడో తెలుసా..? కొడుకు మాటలకు ఎమోషనల్ అయిన మెగాస్టార్(వీడియో)
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ టైం ‘చిరుత’ మూవీలో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన చరణ్.. త్రిబుల్ ఆర్‌తో చిత్రంతో మాత్రం గ్లోబల్ స్టార్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. దర్శకధీరుడు రూపొందించిన ఈ సినిమాతో చరణ్ గ్రాఫ్ అంతా ఒక్కసారిగా మారిపోయింది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే.. అపోలో సంస్థల అధినేత కామినేని ఉపాసనతో ప్రేమలో పడి.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2012లో పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా వీరికి క్లీంకార అనే పాప కూడా పుట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకు సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
ప్రతి ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ఇందులో మెగా హీరోలు, చిరంజీవితో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు పాల్గొని మెగాస్టార్ గొప్పతనం గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెబుతుంటారు. అలానే 2004లో కూడా ఈవెంట్ నిర్వహించారు. శిల్పకళా వేదికలో ఈ వేడుక జరిగింది. దీనికి చిరంజీవి కూడా వచ్చారు. అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే అదే ఈవెంట్‌కి తనయుడు చరణ్‌ని కూడా తీసుకొచ్చాడు. కారణం.. రామ్ చరణ్‌ని హీరోగా పరిచయం చేయాలనుకోవడం. అందులో భాగంగానే ముందుగానే అభిమానులకు పరిచయం చేశాడు చిరు. అభిమానులకు, జనాలకు ఆయన్ని అలవాటు చేసే ప్రయత్నం చేశారు.
ఇక ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేత చిరంజీవి మాట్లాడించారు. స్పీచ్ తెరంగేట్రం అంటూ మైక్ చరణ్‌కి ఇచ్చాడు. ఆయన మైక్ తీసుకోగానే అభిమానులు అరుపులతో హోరెత్తించారు. కాసేపు వరకు ఆయన్ని మాట్లాడనివ్వలేదు. దీంతో చిరంజీవి మైక్ తీసుకుని ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేశాడు. మీ అరుపులను నేను తట్టుకోగలను, కానీ వాడు పాపం పసివాడు, తట్టుకోలేడు. సహకరించాలని తెలిపారు. కాస్త వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో చరణ్ స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడతాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
చిరులో అది ఇంకాస్త ఎక్కువగా ఉంది. టెన్షన్‌గానూ ఉందట. మాట్లాడేంత పెద్దవాడు కాదు, కానీ ఏం మాట్లాడతాడో చూద్దాం, నాకూ టెన్షన్‌గానే ఉందన్నారు చిరంజీవి. మైక్ తీసుకున్న చరణ్, చిరుని పక్కనే ఉండాలని చెప్పడం విశేషం. చూశారా? నేను వెనకాల లేకపోతే భయపడుతున్నాడు? నేను వెనకాల ఉండాలి. వాడి వెనకాల మీరూ(ఫ్యాన్స్) కూడా ఉండాలన్నారు చిరంజీవి.
ఇక ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు చరణ్. `ఈ సందర్భంగా ఏం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి తరఫున, నా తరఫున, అభిమానులందరి తరఫున డాడీకి హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా అంటూ స్టేజ్‌పైనే తండ్రి చిరంజీవికి కాళ్లకి దెండం పెట్టాడు చరణ్. దీంతో కొడుకుని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు చిరు. ఈ సంఘటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ క్షణంలో మెగాస్టార్ సైతం ఎమోషనల్‌గా కనిపించడం విశేషం. ఆ ఆనందంలో కొడుక్కి ముద్దు కూడా పెట్టాడు. అనంతరం మైక్ తీసుకుని చిరంజీవి మాట్లాడుతూ, నాకంటే వాడికి బాగా తెలుసు. ఎలా పడేయాలో మనుషుల్ని, నన్ను పడేశాడు` అంటూ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
(video credits to filmylooks youtube channel)