నామినేషన్ వేసిన సీఎం.. భారీగా తరలివచ్చిన మంత్రులు, నాయకులు

by karthikeya |
నామినేషన్ వేసిన సీఎం.. భారీగా తరలివచ్చిన మంత్రులు, నాయకులు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharastra Assembly Election) దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎం, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తన నామినేషన్ దాఖలు చేశారు. కోప్రీ పాచ్‌పాఖాడీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు (సోమవారం) తన నామినేషన్‌ను స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సీట్ నుంచి షిండే వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కూడా ఆయనతో పాటు ఉన్నారు. అలాగే శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక నామినేషన్ నేపథ్యంలో థానేలో శివసేన తమ బలప్రదర్శన కూడా చేసింది. ఇదిలా ఉంటే ఈ సీట్లో షిండేకు పోటీగా ఉద్ధవ్ వర్గానికి చెందిన కేదార్ దిఘే పోటీచేస్తున్నారు.

కాగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి పొలిటికల్ పార్టీలన్నీ యాక్టివ్ అయిపోయాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలోని శివసేన (షిండే) వర్గం ఈ సారి కూడా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. శివసేన (Shivasena), బీజేపీ (BJP) కూటమిని ఓడించి మళ్లీ అధికారం దక్కించుకోవాలని ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ (Congress), ఎన్‌సీపీ (NCP) కూటమి పట్టుదలగా ఉంది. దీంతో రెండు వర్గాలు గెలుపు కోసం నువ్వా, నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి.

Advertisement

Next Story