సుప్రీంకోర్టు నెక్స్ట్ సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!

by Y.Nagarani |   ( Updated:2024-10-17 04:47:57.0  )
సుప్రీంకోర్టు నెక్స్ట్ సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు నెక్స్ట్ సీజేగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును.. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ (CJI DY Chandrachud) సిఫార్సు చేశారు. తదుపరి సీజేగా సంజీవ్ ఖన్నా నే నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు. నవంబర్ 11న జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీ విరమణ పొందనున్నారు. కేంద్రం ఆమోదిస్తే.. నవంబర్ 12నే సంజీవ్ ఖన్నా సీజేగా బాధ్యతలు చేపడుతారు.

సుప్రీంకోర్టు సీజే నియామక నిబంధనల ప్రకారం.. కొత్త సీజే పేరును లేఖ ద్వారా కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి చేరుకుని.. చివరిగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ పదవిలో ఉన్న సీజేఐ కొత్త సీజే పేరును సిఫార్సు చేయడం సంప్రదాయంగా వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed