ప్రభుత్వ విద్యార్థుల కష్టాలు తీరేది ఎప్పుడు.. ?

by Sumithra |
ప్రభుత్వ విద్యార్థుల కష్టాలు తీరేది ఎప్పుడు.. ?
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసెల గూడెం కాలనీలోని అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు స్కూల్ లోపలకి వెళ్లాలన్న, మూత్రశాలలకు వెళ్లాలంటే మురుకి నీళ్లల్లో నుండి నడవవాల్సిందే. మురికి నీళ్లలో నడవడం వలన విద్యార్థినీ విద్యార్థులకు ఎలర్జీ ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలలో చదువుకొనే విద్యార్థిని విద్యార్థులు ఈ బాధ పడవలసిందే. అసలే ప్రభుత్వ పాఠశాల ఇందులో ఈ పాఠశాలకు సరైన దారి లేదు.

రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విద్యాశాఖ అధికారులు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పాఠశాలకు పిల్లల్ని పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి మండల విద్యాశాఖ అధికారులకు నీళ్లు నిలుస్తున్న విషయం తెలిసినప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాల నుండి మురికి నీటి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాఠశాల విద్యార్థినివిద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోని పాఠశాల సమస్యను తీర్చాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed