Bahubali 3: బాహుబలి 3 పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ సినిమా నిర్మాత

by Prasanna |   ( Updated:2024-10-17 14:56:54.0  )
Bahubali 3: బాహుబలి 3 పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ సినిమా నిర్మాత
X

దిశ, వెబ్ డెస్క్ : బాహుబలి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చింది. పాన్ ఇండియాగా విడుదలవ్వడంతో ప్రభాస్ కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ రిజల్ట్ తర్వాత ప్రభాస్ తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసారు. అయితే, ఇప్పుడు బాహుబలి మూవీ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

బాహుబలి 3 గురించి రాజమౌళిని ఇప్పటికి చాలా మంది అడిగారు. అయితే, అప్పుడు జక్కన్న చెప్పిన సమాధానం ఇకపై ఏ సీక్వెల్ ఉండదని చెప్పుకొచ్చాడు. తాజాగా, ఓ నిర్మాత బాహుబలి 3 గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం, ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సూర్య హీరోగా నటించిన కంగువ మూవీ నిర్మాత జ్ఞాన వేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 3 గురించి మాట్లాడాడు. ఇటీవల బాహుబలి నిర్మాతలను కలిశానని, బాహుబలి 3 కూడా రాబోతుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపాడు. ఇక, దీనిపై రియాక్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ చర్చలు మొదలుపెట్టారు. ఒకవేళ బాహుబలి 3 ఉన్నా.. ఇప్పటిలో మన ముందుకు అవకాశమే లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story