- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cji chnadrachud: మీరు ఒక రోజు మా ప్లేసులో కూర్చోండి.. న్యాయవాదులపై సీజేఐ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ న్యాయవాది ముందస్తు విచారణ తేదీని పదే పదే డిమాండ్ చేయడంతో ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టుకు ఆదేశాలు జారీ చేయొద్దని ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించడంతో శివసేన(యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని న్యాయవాది కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ముందస్తు విచారణ తేదీ కావాలని అభ్యర్థించారు. అయితే ప్రతివాదులు మాత్రం డాక్టుమెంట్ల వెరిఫై కోసం కొంత సమయం కావాలని కోరడంతో ధర్మాసనం గురువారం వరకు గడువు ఇచ్చింది.
ఈ క్రమంలోనే అంతకన్నా ముందే విచారణ చేపట్టాలని శివసేన(యూబీటీ) తరఫు న్యాయవాది కోరాడు. దీంతో సీజేఐ సదరు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఆర్డర్స్ ఇవ్వొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన తేదీని కావాలపి డిమాండ్ చేయడమే తప్ప కోర్టుపై ఉన్న ఒత్తిడిని మాత్రం పట్టించుకోరని తెలిపారు. ‘మీరు ఒక రోజు మా ప్లేసులో కూర్చోండి. అప్పుడు మాపై ఉన్న ఒత్తిడి మీకు కనపడుతుంది’ అని వ్యాఖ్యానించారు. కోర్టుపై ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు. సుప్రీంకోర్టులోకి ప్రతి కేసునూ విచారిస్తామని స్పష్టం చేశారు. తమపై ఉన్న పని ఒత్తిడిని అర్థం చేసుకోవాలని తెలిపారు.