జనన రేటు పెంచేందుకు చైనా తంటాలు..

by Vinod kumar |
జనన రేటు పెంచేందుకు చైనా తంటాలు..
X

బీజింగ్: చైనాలో జనన రేటు తగ్గుతోంది. దీంతో జనన రేటును పెంచేందుకు చైనా నానా తంటాలు పడుతోంది. గతేడాది చైనాలో అత్యంత తక్కువ జనన రేటు నమోదైంది. అంటే 1000 మందికి 6.77 జననాలు నమోదయ్యాయి. తగ్గుతున్న జనన రేటు నేపథ్యంలో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వివాహాలను ప్రోత్సాహిస్తున్నారు. జనన రేటును పెంచేందుకు నవ వధువరులకు 30 రోజుల పెయిడ్ మ్యారేజ్ లీవులను ఇస్తున్నారు.

చైనా కనీస వివాహ లీవు మూడు రోజుల అని కమ్యూనిస్టు పార్టీ సొంత పత్రిక పీపుల్స్ డైలీ హెల్త్ పేర్కొన్నట్టు రాయ్‌టర్స్ నివేదించింది. అయితే ఈ తగ్గుతున్న జననాల రేటు ఎక్కడ బహిర్గతమవుతుందోనని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతూ సొంతంగా అలవెన్సులను ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 30 రోజుల మ్యారేజ్ లీవులు ఇస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు 10 రోజులే ఇస్తున్నాయి. షాంగ్సీలో 30 రోజులు ఇస్తుండగా.. షాంఘైలో 10 రోజులు, సిచువాన్‌లో 3 రోజులు మాత్రమే ఇస్తున్నారు.

సంతానోత్పత్తి రేటును పెంచే మార్గాలలో వివాహ సెలవులు పెంచడం ఒకటి అని సౌత్‌వెస్ట్రన్ యూనివర్శిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సోషల్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డీన్ యాంగ్ హైయాంగ్ చెప్పారు. ‘వివాహ సెలవుల పొడిగింపు ప్రధానంగా అర్థికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో మాత్రమే ఉందని హైయాంగ్ తెలిపారు. ఏది ఏమైనా శ్రామిక శక్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పడిపోతున్న జనన రేటును పెంచేందుకు గృహ రాయితీలు, పితృత్వ సెలవులతో పాటు అనేక విధానాలను అనుసరిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Next Story