- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TikTok: మస్క్ చేతికి టిక్ టాక్..!
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్(TikTok)పై అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉంది. దీంతో, అమెరికాలో టిక్ టాక్ ను కార్యకలాపాలను బిలియనీర్, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)కు విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు చైనీస్ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్ న్యూస్’ కథనం వెల్లడించింది. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలూ దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఇటీవలే అమెరికా ప్రతినిధులలో టిక్ టాక్ కు వ్యతిరేకంగా ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యం దీన్ని వదులుకోకపోతే పూర్తిగా నిషేధం ఎదుర్కోవాల్సిందేనది ఆ బిల్లులోని పొందుపరిచింది. అయితే, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ నియంత్రణలో ఉండాలని చైనా అధికారులు కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, ఆ కంపెనీపై నిషేధాన్ని సవాలు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తోందని నివేదిక పేర్కొంది. ఇక ఈపరిణామాల మధ్య మస్క్ సోషల్ మీడియా ఎక్స్ లో టిక్ టాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో, మస్క్ కు టిక్ టాక్ ను విక్రయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.