- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
జీజీహెచ్ ఐసీయూలో రోగి హల్చల్..
దిశ, కామారెడ్డి : జీజీహెచ్ లో ఓ రోగి సీజర్ చేతిలో పట్టుకుని అందరినీ హడలెత్తించాడు. బుధవారం తెల్లవారు జామున హాస్పిటల్ లోని రోగులు, సిబ్బంది టెన్షన్ పడేలా చేశాడు. ఆస్పత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు నగరానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి జనవరి 12న పురుగుల మందు తాగడంతో చికిత్స కోసం జీజీహెచ్ కు తీసుకొచ్చారు. ఆయనకు వామిట్ చేయించి ఐసీయూలో అడ్మిట్ చేశారు. మధ్యానికి బాగా అలవాటు పడిన ప్రమోద్ కి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కారణంగా మెడిసిన్ తప్ప మద్యం తాగే అవకాశం లేకుండా పోయింది. మద్యం లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, వైద్య సిబ్బందికి కూడా సహకరించకపోవడంతో పేషంట్ కు కాళ్లు చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున బాగా అరుస్తూ కట్లు విప్పుకొని నర్సింగ్ స్టాఫ్ టేబుల్ పై ఉన్న సీజర్ ను పట్టుకొని ఐసీయూలోని తోటి ఇన్ పేషంట్లను భయాందోళనకు గురిచేశాడు. అడ్డుకోబోయిన వైద్య సిబ్బందిని బెదిరిస్తూ ఐసీయూ నుంచి లేబర్ రూంలోకి వెళ్లి లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది లేబర్ రూం డోర్ అద్దం పగులగొట్టి లోపలకు ప్రవేశించి అతన్ని చాకచక్యంగా పట్టుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కొద్దిసేపు ఆస్పత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పేషంట్ ను పట్టుకుని ట్రీట్మెంట్ తిరిగి స్టార్ట్ చేయడంతో అటు ఇన్ పేషంట్లు, హాస్పిటల్ స్టాఫ్ ఊపిరి పీల్చుకున్నారు.