Keerthi Suresh: బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేష్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
Keerthi Suresh: బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేష్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక రీసెంట్‌గా యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhavan) సరసన ‘బేబీ జాన్’(Baby John) సినిమాలో నటించి బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం అయితే సాధించలేదు.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఈ భామ తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిలో‌(Antony Thatil)తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్‌లో శారీలో మత్తెక్కించే కళ్ళతో వయ్యారంగా చూస్తూ ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed