70 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేసిన కాంగ్రెస్ మంత్రి.. అద్భుతమన్న సీఎం

by Javid Pasha |   ( Updated:2023-05-23 07:24:57.0  )
70 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేసిన కాంగ్రెస్ మంత్రి.. అద్భుతమన్న సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: చత్తీస్ గఢ్ కు చెందిన కాంగ్రెస్ మంత్రి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. చత్తీస్ గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన స్కై డైవింగ్ చేశారు. స్కై డైవింగ్ సూట్ ధరించిన ఆయన ఇన్ స్ట్రక్టర్ వెంట రాగా పారాష్యూట్ సాయంతో గాల్లోకి ఎగరాడు. అందుకు సంబంధించిన వీడియోను స్కై డైవింగ్ అనంతరం ఆయన తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘‘ఆకాశంలో పయనించడం చాలా బాగా అనిపించింది. ఆస్ట్రేలియాలో స్కై డైవింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆద్యంతం బాగా ఎంజాయ్ చేశా’’ అంటూ రాసుకొచ్చారు.

కాగా మంత్రి టీఎస్ సింగ్ డియో ఫీట్ పై చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగెల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘వావ్ మహారాజ సాహెబ్.. ఈ ఫీట్ నిజంగా అద్భుతం. ఇదే స్పిరిట్ ను ఎల్లవేళలా కొనసాగించండి’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘వయసు అనేది ఓ నెంబర్ మాత్రమేనని మీరు మరోసారి నిరూపించారు’’ అంటూ సోషల్ మీడియాలో సదరు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed