Chandrayaan-3: చంద్రుడి చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇస్రో

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-22 15:36:24.0  )
Chandrayaan-3: చంద్రుడి చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇస్రో
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో (ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్) సోమవారం చంద్రయాన్ - 3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ చందమామ అవతలివైపు (దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం) చిత్రాలను తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ట్విట్టర్ వేదికగా ఇస్రో పంచుకుంది. ల్యాండర్ హజార్డ్ అండ్ అవిడెన్స్ కెమెరా భూమికి కనిపించని చందమామ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగే ప్రాంతాన్ని ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఇందుకోసం సేఫ్ ప్లేస్ కోసం ల్యాండర్ అన్వేషిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ నెల 19న ల్యాండర్ ఈ ఫొటోలు తీసినట్లు పేర్కొంది. తాజా ఫొటోల్లో చంద్రుడిపై ఉన్న బిలాలు క్లియర్‌గా కనిపించాయి.

Advertisement

Next Story

Most Viewed