Onion Prices: ఢిల్లీలో కిలో రూ. 35కే ఉల్లిని విక్రయించనున్న కేంద్రం

by S Gopi |
Onion Prices: ఢిల్లీలో కిలో రూ. 35కే ఉల్లిని విక్రయించనున్న కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ వ్యాన్‌లు, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిటైల్ షాపుల ద్వారా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కిలో రూ. 35కే సబ్సిడీ రేటుతో కేంద్రం విక్రయాలు చేపట్టనుంది. ఈ అమ్మకాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రిటైల్ అమ్మకాలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉల్లి కిలో రూ. 60కి పైగా ఉండటంతో అధిక ధరల నుంచి వినియోగదారులను రక్షించడానికి, మధ్యవర్తుల జోక్యాన్ని నివారించడానికి సబ్సిడీ రేటుతో ప్రభుత్వం విక్రయించనుంది. విక్రయం కోసం ఎన్‌సీసీఎఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతుల నుంచి నేరుగా ఉల్లిని సేకరించింది.

Advertisement

Next Story

Most Viewed