- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నాలుగు మెడల్స్ స్థానంలో.. ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర హోంమంత్రి పేరిట ప్రకటించే నాలుగు మెడల్స్‌ను విలీనం చేసి ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ అనే కొత్త మెడల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తక్షణమే ఈ మార్పు అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కేంద్ర హోం మంత్రి పేరిట ప్రదానం చేసే స్పెషల్ ఆపరేషన్ మెడల్, మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, అసాధారణ్ ఆసూచన కుశలతా పదక్, ఫోరెన్సిక్ సైన్స్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌లను విలీనం చేసి ఒక కొత్త మెడల్‌ను తీసుకొచ్చారు. ఇకపై ఆ నాలుగు మెడల్స్‌ను విడివిడిగా ప్రదానం చేయబోమని తెలుపుతూ కేంద్ర హోం శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన మెడల్‌కు పోటీపడటానికి పోలీసు బలగాలు, భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ వింగ్, కేంద్ర పోలీసు సంస్థల సభ్యులకు అర్హత ఉంది. ఇకపై దీని కోసం నార్కోటిక్స్ స్మగ్లింగ్ నిరోధానికి అంకితభావంతో పోరాడే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి (సీబీఐసీ) అధికారులు, సిబ్బందిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర సర్కారు వెల్లడించింది.