గోల్డీ బ్రార్‌ ఇక ఉగ్రవాది.. హోంశాఖ ప్రకటన

by Hajipasha |
గోల్డీ బ్రార్‌ ఇక ఉగ్రవాది.. హోంశాఖ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలో కీలక సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్న అతడిని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద టెర్రరిస్టుగా అనౌన్స్ చేసింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడే ఈ గోల్డీ బ్రార్. ఇతడికి సత్వీందర్ సింగ్, సతిందర్‌జిత్ సింగ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ స్టూడెంట్ వీసాతో కెనడాకు మకాం మార్చాడు. అక్కడే ఉంటూ పంజాబ్‌లోని తన అనుచరులతో నేర కార్యకలాపాలు చేయిస్తున్నాడు.

కేసుల చిట్టా..

గోల్డీ బ్రార్‌‌పై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ సహా 13 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో చాలా వాటికి తానే బాధ్యుడినంటూ సోషల్ మీడియా వేదికగా గోల్డీ బ్రార్ ఒప్పుకున్నాడు. దీంతో ఇంటర్‌పోల్ కూడా అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. గోల్డీ బ్రార్‌ 1994లో పంజాబ్‌లోని శ్రీముకర్తసర్ సాహిబ్‌లో జన్మించాడు. తండ్రి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అయినప్పటికీ.. గోల్డీ టీనేజీలోనే పెడదోవ పట్టాడు. నేరజీవితానికి అలవాటు పడ్డాడు. తన కజిన్ గుర్లెజ్ బ్రార్‌ను హత్య చేసిన తర్వాత నేరజీవితం వైపు మళ్ళాడు.

Advertisement

Next Story

Most Viewed