కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు: ఎన్నికల సంఘం

by S Gopi |
కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు: ఎన్నికల సంఘం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చెలరేగే హింసను నిరోధించేందుకు కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మోహరింపును కొనసాగించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) సోమవారం ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలం ముగిసిన తర్వాత కూడా బలగాలను కొనసాగించాలని మొదటిసారి నిర్ణయించినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకైతే ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి హింసాకాండ జరగదని విశ్వసిస్తున్నాం. అయినప్పటికీ ఎలాంటి హింస చెలరేగకుండా ఉండేందుకు తొలిసారి మంగళవారం మోడల్ కోడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత కూడా కేంద్ర బలగాలు ఉంటాయి. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల అంచనాల ఆధారంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లలో బలగాలు కౌంటర్ తర్వాత కొనసాగుతాయి. కౌంటింగ్ రోజు తర్వాత 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో భద్రతా బలగాలు ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కౌంటింగ్ పూర్తయ్యాక రెండు రోజుల పాటు బలగాలు ఉంటాయి.

Advertisement

Next Story