CBSE: సీబీఎస్ఈ సంచలన నిర్ణయం.. పరీక్షా కేంద్రాల్లో అవి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ

by Shiva |
CBSE: సీబీఎస్ఈ సంచలన నిర్ణయం.. పరీక్షా కేంద్రాల్లో అవి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది. 2025లో నిర్వహించబోయే బోర్డు పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా అన్ని పాఠశాలల తరగతి గదుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో దేశంలో, 26 దేశాల్లో ఉన్న 8 వేల పరీక్షా కేంద్రాల్లో సుమారు 44 లక్షల మంది విద్యార్థులు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు రాయనున్నారు. ఒకవేళ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) లేని పక్షంలో అక్కడ పరీక్షలు నిర్వహించబోమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. కొత్తగా ప్రవేశ పెట్టిన సీసీటీవీ (CCTV) వ్యవస్థతో పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా కొనసాగుతామయని బోర్డు అభిప్రాయపడింది.

Advertisement

Next Story