స్వీపర్లుగా మారిన విద్యార్థులు

by Y. Venkata Narasimha Reddy |
స్వీపర్లుగా మారిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చాల పాఠశాలల్లో స్వీపర్లు, అటెండర్లు కూడా లేకపోవడం పాఠశాలల అధ్వాన్న నిర్వాహణకు నిదర్శనంగా కనిపిస్తుంది. కొన్ని పాఠశాలల్లో తరగతి గదులను శుభ్రం చేసేందుకు స్వీపర్లు లేకపోవడంతో విద్యార్ధులే చీపురు పట్టి పాఠశాలను, మరుగుదొడ్లను శుభ్రం చేస్తుకుంటున్న దుస్థితి నెలకొంది. జనగాం జిల్లా, చిలుపూర్ మండలంలోని వడ్డెగూడెం ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఇదే తరహా ఘటన దర్శనమిచ్చింది. పాఠశాలలో చదివేది ఐదుగురు విద్యార్థులే కావడంతో ఇక్కడ టీచర్లే సమయానికి రాని పరిస్థితి ఉండగా, సిబ్బంది కూడా అదే తీరున సాగుతున్నారు. పలకా..బలపం..పెన్ను, పుస్తకం పట్టాల్సిన తమ చిట్టి చేతులతో చీపుర్లు పట్టి విద్యార్థులే తమ ఉపాధ్యాయులు వచ్చేలోగా పాఠశాలను శుభ్రం చేసుకుంటున్నారు. దీనిని గమనించిన స్థానిక నాయకులు ఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ గా మారాయి. పాఠశాల పరిస్థితిపై నాయకులు డీఈఓకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed