కొండపైకి వెళ్లడానికి డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వాలి: పోసాని

by Mahesh |   ( Updated:2024-09-28 11:10:50.0  )
కొండపైకి వెళ్లడానికి డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వాలి: పోసాని
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాగా ఈ వ్యవహారం గత వైసీపీ ప్రభుత్వంలో జరగడంతో మాజీ సీఎం జగన్ స్పందించారు. కూటమి ప్రభుత్వం కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తూ.. తిరుమలలో పూజలు చేయడానికి జగన్ వెళ్లాలని భావించారు. కాగా జగన్ తిరుమలకు వస్తే.. కచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని.. లేకుంటే అడ్డుకుంటామని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు జగన్ ను హెచ్చరించారు. దీంతో ఆయన తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి స్పందించారు. కొండపైకి వెళ్లడానికి డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వాలని..సీఎం చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా అంటూ మండిపడ్డారు. తిరుమలకు రావొద్దు అనడానికి చంద్రబాబు ఎవరని.. జగన్‌ది గ్రేట్‌ పాలిటిక్స్‌ అయితే చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్‌ అంటూ విమర్శించారు. జగన్‌ ఏ పాపం చేశాడని ఆయన్ని హింసిస్తున్నారని.. తిరుమలను నాశనం చేయాలని చూస్తున్నారని పోసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed