Sexual life : శృంగారం సమయంలో మీ భర్త మోటుగా ప్రవర్తిస్తున్నాడా...?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-30 15:50:09.0  )
Sexual life : శృంగారం సమయంలో మీ భర్త మోటుగా ప్రవర్తిస్తున్నాడా...?
X

నేను నా భర్తతో లైంగికంగా కలవలేక అయిష్టంగా ఉన్నాను. నా భర్త కలవాలని బలవంతపెడతాడు. నాకు సెక్స్ మీద అయిష్టత పెరిగింది. ఎందుకో తెలుపగలరు.- భారతి

భారతిగారూ, సహజీవనంలో భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని శృంగారం మరింత బలపరుస్తుంది. మీరు ముందుగా మీకు సెక్స్ అంటే ఎందుకు అయిష్టతో తెలుసుకోండి. తర్వాత ఆ అయిష్టత సహేతుకమైనదా కాదా అన్నది స్పష్టపరుచుకోండి. సెక్స్ సమయంలో నొప్పి ఏమన్నా కలుగుతోందా? మీ భర్త మీతో ఆ సమయంలో మీ ఇష్టానికి విరుద్ధంగా మోటుగా ప్రవర్తిస్తున్నారా? ఎలా ప్రవర్తిస్తే మీకు బాగుంటుందో మీ భర్తకు తెలపండి. సెక్స్ అనేది అసహ్యించుకోదగ్గది - అశ్లీలమైనదీ కాదు. ఆరోగ్యవంతమైన సెక్స్ భార్యాభర్తలిద్దరూ ఆహ్వానించదగ్గదీ, ప్రేమించదగ్గదీ! ముందైతే మీ భార్యాభర్తలిద్దరూ మంచి సెక్స్ థెరపిస్టు దగ్గరకు కౌన్సిలింగ్‌కు వెళ్లండి.

- డాక్టర్ భారతి. MS

సైకోథెరపిస్ట్ &సెక్సాలజిస్ట్

Read More : బెడ్‌పై నేనున్నా ఆ వస్తువులు చూస్తేనే మా ఆయనకు ఉద్రేకం

Advertisement

Next Story