Vijaya Bharathi: ప్రముఖ రచయిత్రి విజయ భారతి కన్నుమూత

by Shiva |
Vijaya Bharathi: ప్రముఖ రచయిత్రి విజయ భారతి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రచయిత్రి, బొజ్జ తారకం (Bojja Tharakam) సతీమణి విజయ భారతి (Vijaya Bharathi) ఇవాళ ఆనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో విజయ భారతి ఇవాళ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కవి, రచయిత బోయి భీమన్న (Boyi Bheemanna) కుమార్తెనే బోయి విజయ భారతి. అంబేద్కర్‌ (Ambedkar), జ్యోతిబా ఫూలే (Jyotiba Phule)ను ఆమె అధ్యయనం చేశారు. ఆ ప్రభావంతోనే భారతీయ కుల వ్యవస్థ, స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ విజయ భారతి పలు రచనలు చేశారు. వాటన్నింటినీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమెను పలు సాహిత్య అవార్డులు వరించాయి.

Advertisement

Next Story

Most Viewed