నా ఉద్దేశం అది కాదు.. విపరీతార్ధాలు తీయవద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మనవి: రామజోగయ్య శాస్త్రీ

by Hamsa |
నా ఉద్దేశం అది కాదు.. విపరీతార్ధాలు తీయవద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మనవి: రామజోగయ్య శాస్త్రీ
X

దిశ, సినిమా: ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రీ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర మూవీకి వర్క్ చేశారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సోంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన పలు కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. దేవరకు సంబంధించిన ఈవెంట్‌లో రామ జోగయ్య శాస్త్రీ మాట్లాడుతూ.. ఎవరి పని వారిని చేయనిస్తే.. సక్సెస్ ఇలానే వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఆయన X వేదికగా తారక్ అభిమానులకు రిక్వెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘ఓరి నాయనో ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది. నా ఉద్దేశం శివ తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారని అన్నాను. అంతే తప్ప మరొకటి కాదు. విపరీతార్ధాలు తీయవద్దని అభిమానులకు మనవి’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed